ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్.. ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు చేస్తూ అక్కడే మకాం వేసేసింది. గత ఏడాది రవితేజ హీరోగా ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చినా కలిసిరాలేదు. ప్రస్తుతం ఆమె ‘పాగల్‌పంతి’ అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. నిన్నమొన్నటివరకు విదేశీ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో చాలా కాలంపాటు డేటింగ్ చేసిన ఇలియానా.. ఇటీవల అతనికి బ్రేకప్ చెప్పేసింది.
తాజాగా ''ది లవ్ లాఫ్" లైవ్ షో కార్యక్రమంలో పాల్గొన్న ఇలియానా తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. ఈ షోలో అడిగిన ప్రశ్నలకు ఇలియానా చెప్పిన సమాధానాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.