ఇలియానా బాలీవుడ్లో జాక్ పాట్ కొట్టేసింది. టాలీవుడ్లో ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్‌పై కన్నేసిన ఈ భామ ఒకేసారి మూడు సినిమాల్లో సంతకం చేసేసినట్లు సమాచారం. పైగా, ఈ మూడూ కూడా యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థలో కావడం విశేషం. దీంతో ఈ గోవా బ్యూటీ ప్రస్తుతం మాంచి జోష్ మీదుంది.