సుకుమార్‌కు అనారోగ్యం- పుష్ప వాయిదా

శనివారం, 24 జులై 2021 (20:34 IST)
Sukumar ph
పుష్ప ద‌ర్శ‌కుడు సుకుమార్‌కు ఆరోగ్యం స‌రిగాలేద‌ని అందుకే షూటింగ్ వాయిదా ప‌డిందని తెలుస్తోంది. ఇటీవ‌లే అల్లు అర్జున్ పుష్ప షూటింగ్‌కు హాజ‌రుకాలేదు. వ‌రుణ్‌తేజ్ సినిమా `గ‌ని` షూటింగ్‌కు అటెంట్ అయ్యాడు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం ఇటీవ‌లే పుష్ప సెట్లో యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. జూబ్లీహిల్స్‌లోని బూత్‌బంగ్లాలోని ప్ర‌త్యేక‌మైన సెట్లో చిత్రీక‌రిస్తున్నారు.

అంత‌కుముందు `రంగ‌స్థ‌లం` వేసిన సెట్ ప్రాంతంలో పుష్ప సెట్ వేశారు. అయితే యాక్ష‌న్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌లో బాగా రావాల‌నే త‌ప‌న‌తో ఆయ‌న డే, అంట్ నైట్ కూడా దానిపై కాన్‌స‌న్‌ట్రేష‌న్ చేయ‌డంతో నిద్ర స‌రిగ్గాలేక‌పోవ‌డంతో కాస్త జ్వ‌రం వ‌చ్చింద‌ని చిత్ర‌యూనిట్ చెబుతోంది. 
 
పుష్ప సినిమాను సుకుమార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కిస్తున్నాడు. అదే ఇదిగా అల్లు అర్జున్ న‌టిస్తున్నారు. ఇటీవ‌లే కేర‌ళ‌లోని సెల‌యేర్లు వున్న లొకేష‌న్‌లో షూటింగ్ చేశారు. ఆ త‌ర్వాత హైద‌రాబాద్‌కు షిప్ట్ అయ్యారు. క‌రోనా త‌ర్వాత అనుకోని అడ్డంకులు కూడా వ‌చ్చాయి. ఇప్ప‌టికే సుకుమార్ క‌రోనా వేక్సిన్ కూడా వేయించుకున్నారు. త‌గు జాగ్ర‌త్త‌లు కూడా తీసుకుంటున్నారు. అయితే ఈ లెక్క‌లు మాస్ట‌ర్ మొద‌టి నుంచీ కేవలం హోమియోపతి మాత్రమే వాడుతుంటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు