కాగా, గని చిత్రం షూటింగ్ ముగింపుకు దశకు చేరుకుంది. పతాకసన్నివేశానికి హాలీవుడ్‌కు చెందిన బాక్సర్‌లను తీసుకువచ్చి చిత్రీకరిస్తున్నారు. విశేషం ఏమంటే, అల్లు అర్జున్ కూర్చుని బాక్సింగ్ చూస్తూన్న సీన్‌ను ప్రమోషన్‌లో వాడుకోనున్నట్లు తెలుస్తోంది. లేదా కథకు సరిపోతే ఏకంగా సినిమాలోనే వుంచేలా నిర్మాత ప్లాన్ చేస్తున్నాడని విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.