అయితే, ఈ చిత్రంపై ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఈ చిత్ర దర్శకుడు 'పిల్ల జమీందార్' ఫేం అశోక్ తీసిన క్రైమాక్స్‌లో ఎక్కడో తేడా వచ్చిందట. దర్శకుడు ప్లాన్ చేసిన క్లైమాక్స్ ఎందుకో నిర్మాతలకు నచ్చలేదట. దీంతో వారు ఒక వెర్షన్‌ను చెప్పారు.
ఈ వెర్షన్ దర్శకుడికి నచ్చలేదు. అయితే ఈ రెండిటిని షూట్ చేసిన ఫైనల్‌గా ఏది బావుంటే అది ఫిక్స్ చేసేలా ప్లాన్ చేసుకున్నారట. అయితే, నిర్మాతలు, దర్శకుడు ఇలా చేయడం అనుష్కకు ఏమాత్రం నచ్చడం లేదట. అందుకే క్లైమాక్స్ విషయంలో అనుష్క కిందామీద పడుతోందట.