సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి ప్రేమ వ్యవహారం బయటపడింది. జర్నీ జైతో అమ్మడు లవ్వాయణం కొనసాగిస్తుందనే వార్తలు నిజమైపోయాయి. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని కోలీవుడ్‌లో వచ్చిన టాక్‌కు దోశ ఛాలెంజ్ సమాధానం ఇచ్చింది. తమిళ స్టార్ హీరో సూర్య విసిరిన ‘దోశ చాలెంజ్’ వీరి ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టింది. సూర్య ఇటీవల ‘ఇంట్లో అందరి కోసం దోశలు వేసే అమ్మ, శ్రీమతి కోసం ఎవరైనా ఒక్క దోశ వేశారా?’ అని ఛాలెంజ్ చేశారు.
ఈ ఛాలెంజ్‌ను హీరో జై స్వీకరించాడు. హీరోయిన్ అంజలి కోసం దోశ వేసి.. ఆమెతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. దానికి స్పందించిన అంజలి ‘యమ్మీ దోశ.. రుచికరమైన దోశ జై.. ప్రియమైన వ్యక్తులు మన కోసం వండితే ఎంత బాగుంటుందో’ అని ట్వీట్ చేసింది. దీనిపై కోలీవుడ్‌లో దుమారం రేగింది. వీరిద్దరూ ఒకే ఫ్లాటులో ఉంటున్నారని.. త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే విషయం దోశ ఛాలెంజ్ ద్వారా తేలిపోయింది. మరి పెళ్లి గురించి అంజలి, జై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.