కిరణ్ రాయల్ చేసిన మోసంతో చనిపోతున్నా: సెల్ఫీ వీడియోలో మహిళ సంచలన ఆరోపణ

ఐవీఆర్

శనివారం, 8 ఫిబ్రవరి 2025 (18:45 IST)
తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ పైన లక్ష్మి అనే మహిళ తీవ్ర ఆరోపణలు చేసారు. సెల్ఫీ వీడియోలో ఆమె మాట్లాడుతూ... లైఫ్‌లో ఒకర్ని నమ్మి మోసపోయా. నేను అతనికి కోటి 20 లక్షలిచ్చాను అప్పులు చేసి. నా పిల్లల్ని చంపుతానని బెదిరించి నా దగ్గర బాండ్లు రాయించుకున్నాడు. నన్ను బెదిరించిన వీడియో ప్రూఫ్స్ నా దగ్గర వున్నాయి.
 
ఇంక నేను బతకలేను. అప్పులు ఎక్కువైపోయాయి. పిల్లలకు సమాధానం చెప్పకలేకపోతున్నాను. అతనెవరంటే తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్. కేవలం కిరణ్ రాయల్ కారణంగానే నేను చనిపోతున్నా. నేను చనిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలికి ఇస్తారని ఆశిస్తున్నా'' అంటూ ఆమె సెల్ఫీ వీడియోలో ఆరోపణలు చేసారు.

తిరుపతి జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్ అరాచకాలు బట్టబయలు

ఓ మహిళను నమ్మించి రూ.1.20 కోట్లు తీసుకుని.. తిరిగి ఇవ్వకుండా బెదిరింపులు

కిరణ్ రాయల్‌ను నమ్మి అప్పు చేసి మరీ డబ్బు ఇచ్చిన బాధితురాలు.. ఇప్పుడు ఆ డబ్బు అడుగుతుంటే ఆమె పిల్లల్ని చంపుతానంటూ బెదిరింపులు

అప్పుల బాధ తాళలేక… pic.twitter.com/11JHFKbhg0

— YSR Congress Party (@YSRCParty) February 8, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు