క్రాక్ సినిమాలో జయమ్మగా నటించిన వరలక్ష్మీ శరతకుమార్ ఆ తర్వాత నాంది సినిమాలో లాయర్‌గా మంచి పాత్ర పోషించింది. నాంది సినిమా సక్సెస్‌టూర్ కూడా తెలుగు రాష్‌ట్రాలలో పర్యటించింది. ఇదే టైంలో చెన్నైలోని తన బంధువుల ఇంటికి ఓ ఫంక్షన్‌కు హాజరైంది. మరి ఇక్కడలా అక్కడ మీడియా వుండదు కదా. వెంటనే అక్కడ వున్న ఓ విలేకరి మీరుకూడా పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారని అడిగాడు. దాంతో ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చిన జయమ్మ కోపంతో సినిమా వాళ్లకు కూడా వ్యక్తిగత విషయాలు ఉంటాయి. వాటి గురించి నలుగురిలో చర్చించడం సబబు కాదు. నన్నే కాదు ఇంకే సినిమా సెలబ్రిటినీ వ్యక్తిగత విషయాలు అడగొద్దు అంటూ ఘాటుగా స్పందించారు. దాంతో ఆశ్చర్యపడినా వెంటనే తేరుకున్న విలేకరి మేరేజ్ ఫంక్షన్‌కదా మేడమ్ అందుకే అడిగానంటూ సమాధానమిచ్చాడు. ఇలాంటివి హీరోయిన్లకు ఎదురు కావడం మామూలే. మిగిలిన హీరోయిన్లు అయితే జరిగినప్పుడు మీకే చెబుతానంటూ సమాధానం ఇచ్చేవారు. మరి జయమ్మ అలా కోపగించిందంటే ఏదో వుందని అర్థమవుతోంది.