ఏఐ సౌకర్యం వచ్చిన దగ్గర్నుంచి సోషల్ మీడియాలో ఆసక్తి రేకెత్తించేందుకు పలువురు యూజర్లు వీడియోలను రూపొందించి పెట్టేస్తున్నారు. ఐతే ఇలాంటి వీడియోల్లో కొన్ని నవ్వించేవిగా వుంటున్నాయి. మరికొన్ని ఆసక్తిని రేకెత్తించేవిగా వుంటే ఇంకొన్ని తీవ్రంగా బాధించేవిగా కూడా వుంటున్నాయి. ఆసక్తికరంగా, వినోదాత్మకంగా రూపొందించే వీడియోలను నెటిజన్లు ఆదరించడమే కాకుండా అలాంటివి క్రియేట్ చేసినవారికి థ్యాంక్స్ చెప్తున్నారు.