ఆయన జూనియర్ ఎన్టీఆర్. తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ అని గతంలో కూడా త్రివిక్రమ్ శ్రీనివాసే స్వయంగా కూడా చెప్పారు. అలాంటి హీరో కోసం అందాల నటి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను బుక్ చేశారు. అంటే.. తన తదుపరి చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్లలో జాన్వీని ఓ హీరోయిన్‌గా త్రివిక్రమ్ ఎంపిక చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
కాగా, త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రం "అరవింద సమేత వీరరాఘవ". ఇపుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రంరానుంది. ఇది జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో 30వ చిత్రం. అందుకే, ఖచ్చితంగా హిట్ కొట్టాలన్న కసితో వారిద్దరూ ఉన్నారు. ఈ చిత్రం నవంబరులో సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే యేడాది సమ్మర్‌కు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో హీరోయిన్లుగా శృతిహాసన్, జాన్వీకపూర్లను ఎంపిక చేసినట్టు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్‌తో శృతిహాసన్ "రామయ్యా వస్తావయ్యా" అనే చిత్రంలో నటించింది. కానీ, జాన్వీ కపూర్ మాత్రం ఇదే తొలిసారి. మరోవైపు, ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ విలన్‌గా నటించనున్నాడనే టాక్ నడుస్తుంది. అయితే, ఈ వార్తలపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సివుంది.