రజినీ కూతురుగా... మరో చిత్రంలో వ్యభిచారిగా... ధన్సికకు వరుస ఆఫర్లు

శుక్రవారం, 10 జూన్ 2016 (13:36 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్, పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కబాలి'. ఇందులో రజినీకాంత్‌కి కూతురుగా ధన్సిక నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం విడుదల కాకుండానే ధన్సికకు అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఇప్పుడు ధన్సిక మరో చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
ఆనంద్ మూర్తి అనే డైరెక్టర్ తెరకెక్కించబోయే చిత్రంలో ధన్సిక నటించబోతుంది. ఇందులో ధన్సిక ఒక వ్యభిచారిగా నటిస్తుంది. ఆనంద్ మూర్తి చెప్పిన కథ నచ్చడంతో ధన్సిక వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇందులో ధన్సిక హాట్ హాట్‌గా కనిపిస్తుందట. అంతే కాకుండా తమిళ అగ్ర దర్శకుడి సినిమాలో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకున్నట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. 
 
దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందులో కార్తీ, నాని, నిత్యామీనన్ హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. మరో హీరోయిన్‌గా ధన్సికను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. రజనీకాంత్ ''కబాలి'' సినిమాలో నటిస్తుండటం వల్లనే తనకు మణిరత్నం సినిమాలో నటించే అవకాశం లభించిందని ధన్సిక ఎగిరిగంతేస్తోందట.

వెబ్దునియా పై చదవండి