రెండు పడవలపై కాళ్ళు పెట్టిన కమల్ హాసన్.. ఏమైంది...?

బుధవారం, 27 సెప్టెంబరు 2017 (12:43 IST)
ప్రయాణిస్తే ఒక పడవలోనే ప్రయాణించాలి. లేదంటే మరో పడవలోనైనా ప్రయాణించాలన్నది అందరికీ తెలిసిందే. రెండు పడవలపై కాళ్లు పెడితే ఇక కింద పడక తప్పదు. ప్రస్తుతం హీరో కమల్ హాసన్ పరిస్థితి అదే. రాజకీయాల్లోకి రావాలనుకుని నిర్ణయం తీసుకున్న కమల్ హాసన్ చివరకు ఏ పార్టీలో చేరాలి.. లేకుంటే సొంతంగా పార్టీ పెట్టాలా అన్న ఆలోచనలో పడిపోయారు. ప్రతిరోజు ఒక నిర్ణయాన్ని తీసేసుకుంటున్నారు. ఎవరి సలహాలు తీసుకోకుండా సొంతంగా ఆయనకు ఆయనే నిర్ణయాలు తీసుకోవడంతో అసలు చిక్కొచ్చి పడుతోంది. 
 
మొదటగా కమ్యూనిస్టులతో వెళ్ళాలనుకున్నారు. ఆ తర్వాత కమల్‌ను డీఎంకే ఆహ్వానించింది. పిమ్మట ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఇప్పుడు కమలనాథులతో దోస్తీ. ఇలా రోజుకో నిర్ణయం తీసుకుంటున్న కమల్ హాసన్ చివరకు ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. 
 
ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత కమల్ హాసన్ రాజకీయాల్లోకి రావాలనుకుని నిర్ణయించుకున్నారు. స్వతహాగా కమల్ ఎవరి మాటావినరు. ఆయనకు ఆయనే ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. అందుకే ఇప్పుడు రాజకీయాల్లోకి వెళితే ఎవరితో జత కట్టాలి.. సొంత పార్టీ పెట్టుకోవాలా లేదా అనే అంశంపై తర్జన భర్జనలో పడ్డారు. ప్రతిరోజు కమల్ హాసన్ చేస్తున్న ప్రకటన అటు రాజకీయ విశ్లేషకులను, ఇటు తమిళ ప్రజలకు నవ్వు తెప్పిస్తోంది. ఈ విశ్వనటుడు చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు