ప్రభాస్ ''సలార్''లో కత్రినా కైఫ్.. కత్తిలాంటి పాటతో కైపెక్కిస్తుందా?

సోమవారం, 2 ఆగస్టు 2021 (22:50 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం 'సలార్' సినిమా రెగ్యులర్ షూటింగ్‌పై దూకుడు పెంచాడు. హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను స్టార్ట్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. 
 
అయితే ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్ నటించనుందని తెలుస్తోంది. ఈ మేరకు ఆమెను సంప్రదించినట్లు సమాచారం. కత్రినా సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో సలార్ స్థాయి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. 
 
కాగా 'రాధేశ్యామ్‌' షూటింగ్ పూర్తిచేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం సలార్‌పై దృష్టి పెట్టాడు. రాధా కృష్ణకుమార్ తెరకెక్కించిన రాధేశ్యామ్ వచ్చే ఏడాది సంక్రాంతిన జనవరి 14కు రాబోతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు