ఆలీ, నరేశ్, పవ్రితా లోకేశ్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం అందరూ బావుండాలి అందులో నేనుండాలి. మలయాళంలో సంచలన విజయం సాధించిన వికృతి చిత్రానికి ఈ సినిమా రీమేక్‌గా రూపొందిన సంగతి తెలిసిందే. ఆలీవుడ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆలీ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి మోహన్ కొణతాల, బాబా ఆలీ, శ్రీచరణ్‌లు సంయుక్తంగా నిర్మించారు. శ్రీపురం కిరణ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఎ.ఆర్.రహమాన్ వద్ద సంగీత శిక్షణ పొందిన రాకేశ్ పళిదం ఈ సినిమా ద్వారా సంగీత దర్శకునిగా మారారు.