బిత్తరపోయిన కీర్తి కోలీవుడ్‌లో తిరిగి తన స్టార్‌డమ్‌ను పొందాలని నిశ్చయించుకుంది. ఇప్పుడు షూటింగ్‌కు ముందు రిహార్సల్ చేస్తోందని వినికిడి. ఎప్పుడూ సాధారణ లుక్‌తో కనిపించే కీర్తి కాస్తంత గ్లామర్‌గా కనిపించే కాస్ట్యూమ్స్‌ను సైతం ఎంపిక చేసుకుని, అభిమానులను ఆకట్టుకోవడానికి పాట్లు పడుతున్నట్లు సమాచారం. తెలుగులోనూ, తమిళంలోనూ నటనాపరంగా ఆకట్టుకునేందుకు కీర్తి మల్లగుల్లాలు పడుతోంది.
ఇదిలా ఉంటే.. మహానటి పాత్రలో నటిస్తున్నట్టుగా చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్, మలయాళీ భామ నిత్యామీనన్‌తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే యూనిట్ సభ్యులు మాత్రం ఎవరి పేరును అధికారికంగా ప్రకటించలేదు.