వరుణ్ ధావన్‌తో కిస్సింగ్ సీన్‌కు రెడీ అయిన కీర్తి సురేష్

సెల్వి

గురువారం, 22 ఫిబ్రవరి 2024 (17:20 IST)
కీర్తి సురేష్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ఆమెను మహానటి అని కూడా పిలుస్తారు. ఇటీవల నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమాతో ఘన విజయం సాధించింది కీర్తి సురేష్. తాజాగా కీర్తి సురేష్ బాలీవుడ్‌లో బేబీ జాన్ సినిమా చేస్తోంది. 
 
బేబీ జాన్ తమిళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తేరికి రీమేక్. బేబీ జాన్ చిత్రంలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తుండగా, కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. అయితే, కీర్తి సురేష్ ఇప్పటివరకు హాట్ కిస్సింగ్ సీన్లు చేయలేదు, ఎక్స్‌పోజింగ్ కూడా చేయలేదు. 
 
అయితే తొలిసారి హాట్ కిస్సింగ్ సీన్స్‌కి రెడీ అంటోంది కీర్తి సురేష్. ఎక్స్‌పోజింగ్‌, లిప్‌లాక్‌ సన్నివేశాలు చేయకపోతే బాలీవుడ్‌లో రాణించడం కష్టమని మహానటి భావిస్తోందని కొద్దిమంది అంటున్నారు. అందుకే వరుణ్ ధావన్‌తో కిస్సింగ్ సీన్‌కు సై అంటోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు