హీరో నాగ చైతన్య, దర్శకుడు చందూ మొండేటి మళ్లీ కలిసి పని చేయనున్నారు. వీరిద్దరూ గతంలో మలయాళ బ్లాక్‌బస్టర్.. తెలుగు వెర్షన్ ‘ప్రేమమ్’లో కలిసి పనిచేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యింది. చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ‘కార్తికేయ 2’ దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.