#BossIsBackfestival స్టార్ట్, ఒక్క టిక్కెట్ రూ.12,00,000... బెంగళూరులో....

మంగళవారం, 10 జనవరి 2017 (19:07 IST)
మెగాస్టార్ స్టార్ డమ్ క్రేజీ ఎంతమాత్రం తగ్గలేదనేందుకు అప్పుడే వార్తలు వచ్చేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం.150 చిత్రం మొదటి షోను చూడాలని ఆయన అభిమాని ఒకరు ఏకంగా ఒక్కో టిక్కెట్టును రూ.12,00,000 పెట్టి మొత్తం 3 టిక్కెట్లను రూ.36 లక్షలతో కొన్నట్లు ఓ వార్త చక్కెర్లు కొడుతోంది. 
 
బెంగళూరులో ఓ థియేటర్లో విడుదలవుతున్న ఖైదీ నెం. 150 చిత్రం టిక్కెట్లను వేలానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ వేలంలో మెగాస్టార్ అభిమాని మూడు టిక్కెట్లను 36 లక్షలకు కొనేసినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తమ్మీద మెగాస్టార్ చిత్రం క్రేజ్ నిజంగా #BossIsBackfestival మాదిరిగా మారిపోయింది.

వెబ్దునియా పై చదవండి