ఎన్టీఆర్ కోసం అమ్మాయిని మార్చేసిన త్రివిక్రమ్??

శుక్రవారం, 27 నవంబరు 2020 (05:59 IST)
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో మరో హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. అయితే, ఈ చిత్రం షూటింగ్‌లో ఉండగానే ఈ ఇద్దరు హీరోలో కొత్త ప్రాజెక్టులకు సంతకం చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. అయితే, ఈ చిత్రంలో ఎన్టీఆర్ జోడీగా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై తర్జనభర్జన సాగింది. చివరకు బాలీవుడ్ హీరోయిన్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఆమె పేరు కియారా అద్వానీ. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ వంటి చిత్రాల్లో నటించింది. 
 
అలాగే బాలీవుడ్‌లో తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్ చిత్రం కబీర్ సింగ్ చిత్రంలో నటించింది. ఈ ఒక్క చిత్రం ఆమె బాలీవుడ్‌లో స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది. ఫలితంగా ఇపుడు బాలీవుడ్‌లో నాలుగు పెద్ద సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉందామె. తెలుగులో 'భరత్‌ అనే నేను', 'వినయ విధేయ రామ' చిత్రాల్లో మెరిసిన ఈ అమ్మడు తాజాగా మరో భారీ సినిమాను అంగీకరించిందని సమాచారం. 
 
దర్శకుడు త్రివిక్రమ్ చెప్పిన కథ నచ్చడంతో ఎన్టీఆర్ ‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ క్రేజ్‌ దృష్ట్యా ఈ సినిమాకు కియారా అద్వాణీ వెంటనే ఓకే చెప్పిందని అంటున్నారు. అయితే ఈ విషయంలో చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు