కరణ్ జోహార్‌కే డేట్స్ లేవన్న కైరా అద్వానీ

శనివారం, 21 మార్చి 2020 (18:08 IST)
కరణ్ జోహార్‌కే కైరా అద్వానీ కోపం తెప్పించిందట. గతంలో కరణ్ జొహార్ నిర్మించిన 'లస్ట్ స్టోరీస్' ద్వారా కైరా అద్వానీకి మంచి గుర్తింపు వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన 'లస్ట్ స్టోరీస్' ఆమె క్రేజ్ ను అమాంతంగా పెంచేశాయి. ఆ తర్వాత ఆమె కెరీర్‌ భేష్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో కరణ్ జొహార్ తన సొంత బ్యానర్లో 'మిస్టర్ లెలె' సినిమాను నిర్మిస్తున్నాడు. 
 
ఈ సినిమాలో కథానాయికగా చేయమని అడగగా, డేట్స్ సర్దుబాటు చేయలేనని చెప్పిందట. తనకి లైఫ్ ఇచ్చిన విషయాన్ని కూడా ఆమె మరిచిపోయి.. డేట్స్ సర్దుబాటు చేయకపోవడంపై కరణ్‌కు కోపం వచ్చిందట. 
 
కాగా మెగాస్టార్ చిరంజీవి 152 సినిమాలో చిరంజీవి రెండు పాత్రలలో కనిపించబోతున్నారు. అందులో ఒకటి యంగ్ చిరంజీవి ఇంకోటి ప్రస్తుతం ఉన్నట్లు చేయబోతున్నారు. అయితే ఒకటి యంగ్ చిరంజీవి పాత్ర లో రామ్ చరణ్ నటించబోతున్నారని ఇప్పటికే ఇండస్ట్రీ పెద్ధ టాక్ నడుస్తుంది.

రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ నటించబోతుందని టాక్. ఇప్పటికే వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు