బుధవారం రాత్రి ఆమె పాత్రికేయులతో పిచ్చాపాటి మాట్లాడింది. కిక్ 2 అనుభవాలను చెప్పుకొచ్చింది. అందులో హాటెస్ట్ సీన్... రవితేజ లిప్ టు లిప్ కిస్ సీన్ గురించి అడిగితే... ఓ అదా, దాని గురించి డైరెక్టర్ సురేందర్ రెడ్డి నాకసలు చెప్పనే లేదు. ఆ రోజు షూటింగ్లో రొమాంటిక్ సన్నివేశం ఉంటుందన్నారు. షూట్ చేస్తున్నారు. ఇంతలో లిప్ టు లిప్ కిస్ పెట్టాల్సిన సన్నివేశం ఉందనగానే నేను వెనుకా ముందు చూసుకున్నాను. మా అమ్మ అక్కడే ఉంది(కిసుక్కున నవ్వుతూ)
అమ్మను అలా బయటకు తీసుకెళ్లమని చెప్పాను. ఆ గ్యాప్లో రవితేజతో లిప్ టు లిప్ లాగించేశా. నిజానికి తొలిముద్దు హిందీ చిత్రంలో నటించేటప్పుడే చేశాను. అప్పట్లో ముద్దు పెట్టుకునేటప్పుడు నర్వెస్గా ఫీలయ్యాను. కాస్త చెమటలు కూడా పట్టాయి. ముద్దు సీన్ సరిగా రాకపోతే ఛాన్సులు రావని భయపడుతూ చేశాను. కానీ కిక్ 2లో రవితేజతో చేసేటప్పుడు అలాంటి భయమేమీ లేకుండా చేసేశా. రెండు పెదవులను అలవోకగా కలిపేస్తూ ముద్దిచ్చేశాను. ఈ సీన్లో సినిమాకు కావల్సినంత ఎమోషన్ పండిస్తూ ముద్దు ఇచ్చేశాను. ఇప్పుడు ముద్దంటే నాకేం భయంలేదు" అని చెప్పింది.