కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్‌లో స్నేహితులు అయిన నిర్మాత ఫరాఖాన్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పాల్గొన్నారు. ఫిలిమ్ మేకర్, టెన్నిస్ ప్లేయర్ అయిన వీరిద్దరూ.. రణ్ వీర్ సింగ్- రణ్ బీర్ కపూర్‌లపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వీరిద్దరితో డేటింగ్‌కు వెళ్ళే అమ్మాయిలు బాక్సుల నిండా కండోమ్స్ తీసుకెళ్లాలని ఫరాఖాన్ అన్నారు. రణ్ వీర్‌తో డేటింగ్‌కు వెళ్ళే అమ్మాయిలకు మీరిచ్చే సలహా ఏంటని కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు.. ఫరాఖాన్ పైవిధంగా సమాధానం ఇచ్చారు. ఈ ప్రోగ్రామ్ ఆదివారం రాత్రి 9 గంటలకు స్టార్ వరల్డ్ హెచ్‌డీలో ప్రసారం కానుంది.
ఈ సందర్భంగా కత్రినా కైఫ్, దీపికా పదుకొనే గురించిన ప్రశ్నలను ఆ నటులకు సంధించారు. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు జవాబు చెబుతూ, సినిమా మొత్తంలో కత్రిన హావభావాలు ఒకేలా ఉంటాయని రణ్ వీర్ సింగ్ అనడంతో ఆమె మాజీ ప్రియుడు రణ్ బీర్ కపూర్ నవ్వు ఆపుకోలేకపోయాడు. ఆరేళ్ల తమ ప్రేమ విఫలమైనందుకు తనకు ఎటువంటి బాధా లేదని రణ్ బీర్ కపూర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.