Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

సెల్వి

శనివారం, 10 మే 2025 (20:29 IST)
narendra modi_Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించామన్నారు. సుదీర్ఘ చర్చల తర్వాత ఇరుదేశాలు అంగీకరించాయంటూ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. 
 
డొనాల్డ్ ట్రంప్ పోస్టు చేసిన కొద్ది సేపటికే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు స్పష్టం చేశారు. 
 
మరోవైపు భారత్‌-పాకిస్థాన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఆగిపోయింది. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్‌ సోషల్ ఖాతాలో ట్వీట్‌ చేశారు. 
 
దీనిపై భారత్‌ కూడా స్పందించింది. శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి తాము కాల్పుల విరమణకు అంగీకరించామని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. మరోవైపు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్‌ దార్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు