టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ, హీరోయిన్ రమ్యకృష్ణలు దంపతులు వేరుపడినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. 'బాహుబలి' చిత్రం కోసం ఐదేళ్ళపాటు కాలాన్ని వెచ్చించిన రమ్యకృష్ణ.. కుటుంబానికి బాగా దూరమైందట. ఈ దూరం కాస్త అపార్థంగా మారి... వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తి విడిపోయినట్టు ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేసింది.
దూరంగా ఉన్నా మా మధ్య ప్రేమ తగ్గదు. అర్థం చేసుకునే భర్త రావడం నిజంగా నా అదృష్టం అని రమ్యకృష్ణ సమాధానమిచ్చారు. అదేసమయంలో మా ఇద్దరికీ షూటింగులు లేనపుడు, ఖాళీ సమయం దొరికినపుడు తన కుమారుడితో కలిసి టూర్స్ వెలుతుంటామని, ఫోన్ ద్వారా ఎప్పుడూ టచ్‌లోనే ఉంటామని రమ్యకృష్ణ తెలిపారు.