ప్రస్తుతం ఓపక్క దర్శకుడిగా, నటుడిగా బిజీగా ఉన్న నాటి కొరియోగ్రాఫర్ లారెన్స్, మళ్లీ స్టెప్స్ కంపోజ్ చేస్తానంటున్నాడు. అయితే, తాను ఈ ఆఫర్ ఇస్తున్నది కేవలం మెగాస్టార్‌కు మాత్రమేనని చెప్పారు. గతంలో చిరంజీవి నటించిన పలు సినిమాలకు అద్భుతమైన డ్యాన్స్ కంపోజ్ చేసి, మెగాస్టార్ మన్ననలందుకున్న లారెన్స్ ఇప్పుడు ఆయన నటించే 150వ సినిమాపై ఓ కన్నేశాడు.
ఆ సినిమాలో చిరంజీవికి వెరైటీ స్టెప్స్ కంపోజ్ చేయాలనీ, నేటి కుర్ర హీరోలను మించిన రీతిలో ఆయన చేత స్టెప్స్ వేయించాలనీ ఉవ్విళ్లూరుతున్నాడు. అందుకే, ఆ సినిమాకు డ్యాన్స్ కంపోజ్ చేస్తానంటూ అప్పుడే మెగా క్యాంపులో ఓ కర్చీఫ్ వేసేశాడట. వీలైతే సింగిల్ కార్డు కొట్టేయాలని ఈ తమిళ నటుడు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే, ప్రస్తుత యంగ్ కొరియోగ్రాఫర్లను వదిలేసి, లారెన్స్‌కు చిరంజీవి ఛాన్స్ ఇస్తాడా లేదా అన్నది వేచి చూడాల్సిందే.