కాంచ‌న 3 త‌ర్వాత లారెన్స్ భారీ ప్లాన్... మెగాస్టార్ చిరుతో...

శుక్రవారం, 29 మార్చి 2019 (13:50 IST)
రాఘ‌వ లారెన్స్ తెర‌కెక్కించిన తాజా చిత్రం కాంచ‌న 3. ముని సినిమాకి 4వ పార్ట్ గా వ‌స్తున్న కాంచ‌న 3 సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ సినిమాలో లారెన్స్ స‌ర‌స‌న‌ వేదిక, ఓవియా నటించారు. హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్ 19వ తేదీన విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా కాంచ‌న 3 ట్రైలర్‌ను లాంచ్ చేశారు. అనంత‌రం లారెన్స్ మాట్లాడుతూ.... మునికి తీసిన అన్ని పార్ట్‌లు సూపర్ హిట్ అవడం థ్రిల్లింగ్‌గా ఉంది. 
 
ఇప్పుడు 4వ పార్ట్‌గా వస్తున్న కాంచన 3 కూడా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. దేవుని అనుగ్రహంతో, ప్రేక్షకుల ఆదరణతో 10 పార్ట్‌ల వరకు తీయలనేది నా బలమైన కోరిక. నేను హీరోగా, డైరెక్టర్‌గా సినిమాలు చేస్తూనే, నన్ను పెద్ద డాన్స్ మాస్టర్ని చేసిన మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమా చేయాల‌నుకుంటున్నాను. అలాగే నన్ను మాస్ సినిమాతో డైరెక్టర్‌ని చేసిన కింగ్ నాగార్జున గారితో ఒక సినిమా  చేయాలనేది నా కోరిక అన్నారు. లారెన్స్ ఆలోచ‌న బాగానే ఉంది. మ‌రి.. ఈ ప్రాజెక్టులు ఎప్పుడు సెట్స్ పైకి వెళ‌తాయో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు