సూపర్ స్టార్ మహేష్ నిర్మాణ రంగంలో సత్తా చాటేందుకు ఎంబీ అనే బ్యానర్‌ను స్థాపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే యాడ్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్, మల్టీఫ్లెక్స్‌ల్లో పెట్టుబడులు చేస్తుంటాడు. తాజాగా నిర్మాణ సంస్థలో వరుసగా సినిమాలు చేసే దిశగా రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ బ్యానర్‌కి సంబంధించిన వ్యవహారాలు మహేష్ భార్య నమ్రత చూసుకుంటుందనే సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు ఈ బ్యానర్‌పై వరుసగా సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలా అని భారీ బడ్జెట్ సినిమాలు కాదు.. చిన్న బడ్జెట్‌తో సినిమాలు చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం డైరెక్టర్ల కోసం వేట మొదలెట్టారట. రెండు, మూడు కోట్ల బడ్జెట్‌లో మంచి సినిమాలు తీయగలిగే దర్శకులకు అవకాశాలు ఇవ్వాలని నమ్రత ఆలోచిస్తున్నారట.