అమిత్ షా జాబితాలో మంచు లక్ష్మి...?

గురువారం, 6 ఏప్రియల్ 2017 (16:56 IST)
భాజపా 2019 ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల నుంచి బోణీ కొట్టాలని గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. ఇప్పటికే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను వెతికేపనిలో పడింది. తెలంగాణ గురించి అమిత్ షా చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నారట.
 
ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఇప్పటికే కొంతమంది పేర్లు అమిత్ షా జాబితాలో చేరిపోయాయట. అందులో కలెక్షన్ కింగ్ కుమార్తె మంచు లక్ష్మీప్రసన్న ఒకరంటున్నారు. ఈమె సామాజిక సేవ గురించి విడమర్చి చెప్పక్కర్లేదు. ఇప్పటికే బుల్లితెర హోస్టెస్‌గా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమస్యలపై ఎలుగెత్తి మాట్లాడటంలో మంచు లక్ష్మి ముందుంటారు.
 
ఈ నేపధ్యంలో మంచు లక్ష్మిని తమ పార్టీ నుంచి పోటీ చేయించాలని అమిత్ షా భావిస్తున్నారట. ఆమెకు చిత్తూరు జిల్లా సీటును ఇచ్చి అక్కడి నుంచి పోటీకి దింపాలని అనుకుంటున్నట్లు సమాచారం. దీన్నిబట్టి తెలుగుదేశం పార్టీతో భాజపా కటీఫ్ చేసుకుంటుందని అనుకోవచ్చు. ఇప్పటికే వైసీపి నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను కట్టబెట్టడంపై భాజపా నాయకురాలు పురంధేశ్వరితో పాటు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించిన సంగతి తెలిసిందే. మొత్తమ్మీద చూస్తే భాజపా అభ్యర్థుల ఎంపికలో చాలా చాలా ముందుచూపులో వున్నట్లు అర్థమవుతుంది.

అదిసరే రంభకు తన భర్తకు సయోధ్య కుదిరింది...చూడండి వీడియో

వెబ్దునియా పై చదవండి