ఇక బాహుబలి తరహాలోనే మహాభారం కథను తెరకెక్కించేందుకు మలయాళంలో పలువురు ప్రయత్నించారు. అది పూర్తికాలేదు. అలాంటి టైంలో ఇంతకుముందు పెద్ద సక్సెస్ దర్శకుడిగా పేరుపొందిన మణిరత్నం ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఇది తమిళం మూలాల్లోని ఓ నవల ఆధారంగా తెరకెక్కింది .రెండు భాగాలు తీస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ ఈనెలాఖరులో విడుదలకాబోతుంది. నిన్ననే చెన్నైలో పలు భాషల్లో ఈ చిత్రం ట్రైలర్ విడుదలయింది. ట్రైలర్ చూస్తుంటే అన్ని భాషలకు చెందిన నటీనటులు కనువిందుగా కనిపించారు.కానీ ఎక్కడా సామాన్యుడిని ఆకట్టుకునే ట్విస్ట్ తరహాలో లేదనేది సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ట్రైలర్ ను చూస్తుంటే మరోసారి బాహ/బలిని చూసినట్లుందంటూ కొందరు వ్యాఖ్యానించడం విశేషం.
మరో వైపు మణిరత్నంతోపాటు లైకా వంటి అగ్రనిర్మాణ సంస్థలు నిర్మించిన ఈ సినిమా ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాల్సిందే. బాహుబలి1,2 సినిమాలు ఊహించని విజయాన్ని, కలెక్షన్లు రాబట్టుకున్నాయి. మరి పులిని చూసి నక్క వాత పెట్టినట్లుగా వుంటుందా? అనేది త్వరలో తెలియనుంది.