హైటెక్ సిటీలో కోలివింగ్ స్పేసెస్, అమ్మాయిలు-అబ్బాయిలు ఒకే గదిలో వుంటే?: వీహెచ్ ఆందోళన

ఐవీఆర్

బుధవారం, 25 జూన్ 2025 (22:32 IST)
చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు మీడియా ముందుకు వచ్చారు. ఆయన పలు విషయాలపై మాట్లాడారు. ముఖ్యంగా హైటెక్ సిటీలో కో లివింగ్ స్పేసెస్ పెడుతున్నారనీ, ఒకే గదిలో అమ్మాయి-అబ్బాయి కలిసి వుండేందుకు అనుమతి ఇవ్వడం ఇదెక్కడ న్యాయం అండీ ప్రశ్నించారు. ఒకవైపు అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరుగుతుంటే ఇలా కో లివింగ్ స్పేసెస్ అంటూ ఇచ్చేస్తే పరిస్థితి ఎలా వుంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి.
 
ఒకే గదిలో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి వుండటం ఏంటండీ, ఇదివరకు చక్కగా ఉమెన్స్ హాస్టల్స్, మెన్ హాస్టల్స్ వేర్వేరుగా వుండేవి. ఇప్పుడు ఇలా కో లివింగ్ కల్చర్ వచ్చిందనీ, దాన్ని సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కోరుతున్నానని అన్నారు. దేశంలో హైదరాబాద్ నెం. 1 నగరంగా వుండాలంటే ఇలాంటివన్నీ లేకుండా చూడాలంటూ సూచన చేసారు.

హైటెక్ సిటీలో కో లివింగ్ స్పేసెస్ పెడుతున్నారు

ఒకే రూంలో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఉంటున్నారు

ఇలాంటి కో లివింగ్ కల్చర్ ఆపాలని సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కోరుతున్నాను

హైదరాబాద్ నెంబర్ వన్ సిటీ కావాలంటే ఇలాంటి వాటిని కట్టడి చేయాలి pic.twitter.com/azreLhnh6i

— Telugu Scribe (@TeluguScribe) June 25, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు