సినీ స్టార్స్ మృణాల్ ఠాకూర్, ధనుష్ డేటింగ్ ప్రేమలో వున్నారని, ఫిబ్రవరి 14, 2026న వివాహం చేసుకోవాలని యోచిస్తున్నారని పుకార్లు వచ్చాయి. ఈ వార్తలపై మృణాల్ స్పందించింది. "ఈ పుకార్లు ఎక్కడి నుండి వ్యాపించాయో నాకు తెలియదు. అవి పూర్తిగా నిరాధారమైనవి" అని చెప్పింది.
ఇంతలో, మృణాల్ ఠాకూర్ తన తదుపరి పాత్రలో అడివి శేష్‌తో కలిసి డకోయిట్‌లో నటించడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 10, 2026న పెద్ద ఎత్తున విడుదల కానుంది. మొదట మార్చి 19న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, ధురంధర్ 2, టాక్సిక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద వార్‌ను నివారించడానికి నిర్మాతలు విడుదలను వాయిదా వేశారు.