అక్కినేని నాగచైతన్య - సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం లవ్ స్టోరీ. ఇందులో చైతన్య సరసన ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటిస్తుంది. లవ్ స్టోరీ ఇంకా ఓ పాట, కొంత టాకీ షూట్ చేయాల్సివుంది. అక్టోబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి క్రిస్మస్ కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. చైతన్య చేయనున్న మూవీ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఈ మూడు పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయని.. మనం తరహాలో చాలా కొత్త కథ అని టాక్. ఫైనల్ నెరేషన్ విని చైతు ఓకే చెప్పారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే అఫిషియల్‌గా ఈ మూవీని ఎనౌన్స్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. చైతన్య మూడు గెటప్పులో కనిపించడం అంటే కొత్తగానే ఉంటుంది. మరి... ఈ సరికొత్త ప్రయత్నం వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.