టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ఇంట మరో శుభకార్యం జరగబోతోంది. ఇటీవలే రెండో కుమారుడు, హీరో అఖిల్ నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే. అయితే నాగార్జున పెద్ద కొడుకు, యువ హీరో నాగచైతన్య నిశ్చితార్థం తేదీ కూడా ఖరారైంది.
ఆ ప్రకారంగా... 2017 జనవరి 29న సమంత, నాగచైతన్య నిశ్చితార్థ వేడుక జరగబోతోంది. కొన్ని సంవత్సరాలుగా ఈ టాలీవుడ్ జంట... గత కొంతకాలంగా ప్రేమలో మునిగిపోయిన వినికిడే. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో ఒక్కటవుతున్నారు. నాగార్జున ఇప్పటికే ఈ నిశ్చితార్థ వేడుకకు ఏర్పాట్లు కూడా ప్రారంభించారట.
అంతేకాదు, అఖిల్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని భావిస్తున్నాడు. అఖిల్ అన్నయ్య నాగ చైతన్య కూడా ఇదే తరహాలో సమంతను పెళ్లాడాలని అనుకుంటున్నాడట. ఏదేమైనా అక్కినేని నాగార్జున ఇంట జరిగే ఈ శుభకార్యాలకు అతిరథ మహారథులు తరలిరానున్నారు.