టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణతో "సింహ" చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేసిన హాట్ బ్యూటీ నమిత. ఈ తమిళ బొద్దుగుమ్మ తమిళ బిగ్‌బాస్‌లో ఓ పార్టిసిపెంట్‌గా పాల్గొని ఆ తర్వాత ఎలిమినేట్ అయింది. తమిళంలో విశ్వనటుడు కమల్ హాసన్, కన్నడంలో కిచ్చ సుదీప్, తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు. అయితే, తెలుగులో బిగ్‌బాస్‌లో ఇప్పటివరకు ఎలాంటి వివాదాలు చోటుచేసుకోలేదు.. చిన్న చిన్న విషయాలు మినహా ఈ షో ప్రశాంతంగా సాగిపోతోంది.
కానీ, తమిళ విషయానికి వస్తే అనే వివాదాలు నెలకొంటున్నాయి. ముఖ్యంగా కమల్ హాసన్ చేసే వ్యాఖ్యానంతో పాటు పార్టిసిపెంట్స్ వ్యవహారశైలి, వస్త్రధారణ తదితర అంశాలు ఈ షోకు మంచి మైలేజ్‌ను తీసుకొచ్చాయి. ఇలా మైలేజ్ రావడానికి కారణం హీరోయిన్ నమిత కూడా ఒకరు. అయితే వారంవారం ఎలిమినేషన్‌లో భాగంగా ఈ మధ్య నమిత షోకు దూరమైంది.