బాలక్రిష్ణ వెంటపడ్డ నమిత.. ఎందుకు..?

మంగళవారం, 30 జులై 2019 (20:46 IST)
సింహ సినిమాలో బాలక్రిష్ణతో నమిత ఆడిపాడింది. సింహా..సింహా అనే పాట బాగానే పాపులరైంది. బాలక్రిష్ణతో పూర్తిస్థాయి రోల్‌లో నటించాలని హీరోయిన్ నమితకు ఎప్పటి నుంచో కోరికట. అయితే ఆ కోరిక కె.ఎస్.రవికుమార్ ద్వారా తీరుతుంది అనుకుందట. కానీ నమితను తన సినిమాలో తీసుకునేందుకు దర్సకుడు ఇష్టపూర్వకంగా లేరట.
 
బాలక్రిష్ణతో యాక్షన్ సినిమాను తీసేందుకు కె.ఎస్.రవికుమార్ సిద్థమయ్యారు. హీరోయిన్ సోనాల్ చౌహాన్. ఈ సినిమాలో ఆడ విలన్ కావాలట. అది కూడా బాలక్రిష్ణ ఫిజిక్‌కు తగ్గట్లు సరిగ్గా సరిపోవాలి. అందులోను గ్లామర్ కూడా ఉండాలట. అందుకే విలన్ క్యారెక్టర్ల కోసం వెతుకుతున్నారట దర్సకుడు కె.ఎస్.రవికుమార్.
 
అయితే మొదట్లో నమితను ఈ సినిమాలో తీసుకోవాలని దర్సకుడు అనుకున్నారట. అయితే ఆమె ఆ క్యారెక్టర్‌కు సరిపోదని సినిమా యూనిట్ లోని కొంతమంది దర్సకుడికి చెప్పడంతో ఆయన కూడా వెనక్కి తగ్గారట. తన పేరును ప్రతిపాదించి చివరకు తాను వద్దనుకోవడంతో నమిత ఎలాగైనా ఆ సినిమాలో నటించాలని నిర్ణయించేసుకుందట. 
 
తనకు పరిచయం ఉన్న బాలక్రిష్ణ వెంటపడుతూ అవకాశం తీసివ్వాలని కోరుతోందట. అయితే ఆ సినిమాలో విలన్‌గా నీకే అవకాశం ఇచ్చేలా డైరెక్టర్‌ను నేను ఒప్పిస్తానని బాలక్రిష్ణ హామీ ఇచ్చారట. ఆగష్టు 7వ తేదీ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు