మీకు దణ్ణం పెడుతున్నా.. నా గురించి దుష్ర్పచారం చేయొద్దండి..

మంగళవారం, 7 మే 2019 (13:42 IST)
మాస్ మహరాజ్ రవితేజ బాగా డల్లయ్యారు. కొంతమంది పనిగట్టుకుని తనపై దుష్ర్ర్పచారం చేస్తుండటంతో రవితేజ హర్ట్ అయ్యారు. స్వయంగా ఈ విషయాన్ని ఆయనే చెబుతున్నారు. నా సినిమాలు కొన్ని ఆగిపోయాయని, తనను పెట్టి సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని కొంతమంది ఎందుకో ప్రచారం చేస్తున్నారు. నాకు అర్థం కావడం లేదు. నేల టిక్కెట్టు తరువాత తను నటిస్తున్న డిస్కోరాజా సినిమా మొదటి దశ షూటింగ్ పూర్తయ్యింది.
 
సెకండ్ హాఫ్ షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. కానీ కొంతమంది డిస్కో రాజా సినిమా ఆగిపోయిందని, నిర్మాతకు, రవితేజకు పడలేదని ప్రచారం చేస్తున్నారు. తాను అడిగినంత డబ్బు నిర్మాత ఇవ్వలేదని కూడా రకరకాలుగా ప్రచారం చేసేస్తున్నారు. ఇదంతా మానుకోండి.. దయచేసి మీకు రెండు చేతులు జోడించి చెబుతున్నా. నేను సాధారణ నటుడిని. నాకు అహంకారం లేదు. 
 
నా పని నేనేదో చేసుకుంటూ పోతున్నాను. నాకు తెలుగు చిత్రసీమలో రెకమెండేషన్ కూడా లేదు. నా స్వంతంగా నేను సినీపరిశ్రమలోకి వచ్చాను. నాకొక పేరును సంపాదించుకోగలిగాను. ఇక నా గురించి వదంతులు సృష్టించకండి అంటున్నారు రవితేజ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు