గ్లామర్ నుంచి పెర్‌ఫార్మెన్స్ పాత్రలు పోషించిన నయనతార దెయ్యం సినిమాల్లోనూ నటిస్తోంది. అందంతోపాటు భయపెట్టం వచ్చంటూ.. 'మాయ' చిత్రాన్ని చేసి భయపెట్టింది. మరోసారి అలాంటి ప్రయోగం చేస్తుంది. దాదాపుగా తమిళంలో సూటింగ్ పూర్తయిన 'దొర' చిత్రం ఫస్ట్‌లుక్ వినాయకచవితికి విడుదలైంది. మాస్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని తీసిన ఈ సినిమాలో నయనతార గ్లామర్‌ను కూడా పండించిందట.
దాస్ రామస్వామి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయన కెరీర్‌లో మరో మెట్టు ఎక్కేలా చిత్రాన్ని మలిచినట్లు చెబుతున్నారు. కాగా, ఇప్పటికే సత్యరాజ్ నటించిన 'దొర' పేరుతో ఓ హారర్ సినిమా విడుదలై డిజాస్ట్‌ర్‌గా మారింది. అయితే.. నయనతార దొర తమిళ పేరు కాబట్టి.. తెలుగులో ఏం పెడతారో చూడాలి. ఒకవేళ అదే పేరు పెడితే.. ప్రేక్షకులు కన్‌ఫ్యూజ్ అయి.. పోయిన సినిమాగా భావిస్తారేమో.