హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుందని ఇటీవల గుసగుసలు వినిపించాయి. నయనతార, విజయ్ 'సేతుపతి' జంటగా విఘ్నేష్ దర్శకత్వంలో విడుదలైన 'నేనూ రౌడీనే' చిత్రం నచ్చి సూర్య ఆయన దర్శకత్వంలో నటించాలని భావించినట్లు వార్తలు వినిపించాయి. అయితే వీటిని నిజం చేస్తూ.. దర్శకుడు విఘ్నేష్ శివన్ ట్వీట్ చేశారు. సూర్యతో సినిమా తీయడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని పేర్కొన్నారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి, స్టూడియో గ్రీన్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారని తెలిపారు.
ఈ సినిమాలో కీర్తి సురేష్ ఒక హీరోయిన్ కాగా, మరో హీరోయిన్ కోసం నయనతార, హన్సికల మధ్య పోటీ నెలకొంది. ఈ సినిమాలో నయనతారను ఎంపిక చేశారన్న వార్తలు కూడా ఆ మధ్య కోలీవుడ్‌లో వినిపించాయి. అయితే చివరి నిమిషంలో ఆ అవకాశం హన్సికకే దక్కిందని అంటున్నారు. నయనతార, హన్సికలతో గతంలో సూర్య సినిమాలు చేసినా ఈ సినిమాకు మాత్రం హన్సికకే తన ఓటు వేయడంతో విఘ్నేష్ మౌనం వహించక తప్పలేదట. కాగా సూర్య కథానాయకుడిగా రూపుదిద్దుకుంటున్న 'సింగం-3' చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తయింది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.