బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఓనం పండుగను జరుపుకున్న నయనతార

గురువారం, 15 సెప్టెంబరు 2016 (09:31 IST)
టాలీవుడ్, కోలీవుడ్‌లలో క్రేజీ బ్యూటీగా వెలుగుతున్న అందాల తార నయనతార. కెరీర్‌పరంగా బరువైన పాత్రలు పోషించడంతో బాటు, నిజ జీవితంలో కూడా దానికి మించినస్థాయిలో సమస్యలను ఎదుర్కొంది. శింబు, ప్రభుదేవా వంటి వాళ్లతో లవ్ బ్రేకప్స్‌తో బాటు ఎన్నో గాసిప్స్‌కి తను కేంద్రం అయింది. 
 
ఇటీవల ఈ చిన్నది విఘ్నేశ్ శివన్ అనే దర్శకుడి ప్రేమలో పడిందనీ, అతన్ని వివాహం చేసుకోనుందని వార్తలొస్తున్నాయి. మొన్నటి వరకు కాస్త గుట్టుగా ఉన్న ఈ జంట ఇప్పుడు ఓపెన్ అయిపొయింది. సైమా అవార్డుల వేడుకలో ఈ జంట చెట్టాపట్టాలేసుకొని కనిపించడం అందరికి తెలిసిందే. 

ఇప్పుడు తాజాగా ఓనం పండుగను కలసి జరుపుకున్నది ఈ జంట. నయనతార కూడా కేరళ అమ్మాయి కావడంతో ఈ పండగరోజుని సంప్రదాయ పద్దతిలోనే చేసుకుంది. బంగారు జరీ అంచున్న తెల్లటి చీరలో ముస్తాబై ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. 
 
ఆమె పక్కన విఘ్నేష్ శివన్ కూడా ఉన్నాడు. ఈ పండుగను కుటుంబసభ్యులతో కలిసి జరుపుకోవాలని సొంతూరు వెళ్ళింది నయన్. ఒంటరిగా కాకుండా... ప్రియుడు విగ్నేష్ శివన్ వెంటబెట్టుకొని మరీ వెళ్లింది. నయన్ ఇంట్లో తీసిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతోంది. 

వెబ్దునియా పై చదవండి