ప్రస్తుతం రజనీకాంత్ ''రోబో 2.0'' సినిమా షూటింగులో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత ఆయన ధనుష్ ప్రొడక్షన్లో పా.రంజిత్ డైరక్షన్లో మరో సినిమాను చేయడానికి రంగం చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా కబాలి సీక్వెల్ కాదని రంజిత్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా అమలా పాల్‌ను అనుకున్నప్పటికీ.. మరో హీరోయిన్ హీరోయిన్ కోసం దర్శకనిర్మాతలు వెతుకులాట ప్రారంభిస్తున్నారు.
కాగా మరో కథానాయికగా నయనతారను సంప్రదిస్తున్నారట. నయనతార వరుస సినిమాలతో చాలా బిజీగా వుంది. గతంలో రజనీకాంత్ సరసన నటించడంతో, ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఆమె డేట్స్ సర్దుబాటు చేయవచ్చని కోలీవుడ్ జనాలు అనుకుంటున్నారు.
ఒకవేళ ఏ కారణంగానైనా ఆమె చేయలేకపోతే, అప్పుడు త్రిషను తీసుకుందామనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఈ మలయాళ భామ సూపర్ స్టార్ సరసన నటించే అవకాశాన్ని వినియోగించుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.