పవన్ కళ్యాణ్ హీరోగా "కొమరం పులి" చిత్రం వచ్చింది. బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నిరాశపరిచిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా నికిషా పటేల్ నటించగా, ఎస్.జే సూర్య దర్శకుడు. పైగా, నికిషా పటేల్ టాలీవుడ్ వెండితెరకు పరిచయమైన మొదటి చిత్రం కూడా ఇదే.
నిజానికి పవన్ సినిమాలో హీరోయిన్ అంటే ఆ తర్వాత వరుసబెట్టి సినిమా అవకాశాలు వచ్చేస్తాయని ఆశపెట్టుకుంది. కానీ, ఆ సినిమా పరాజయం పాలవడంతో ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. నిజానికి ఆమె 'కొమరం పులి'లో నటించడానికి మొదట ఇష్టపడలేదట. దర్శకుడు ఎస్‌జే సూర్య ఒత్తిడి చేయడం వల్లే ఒప్పుకుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమే తెలియజేసింది.
'ఓ బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇద్దామనుకున్నా. నాకు ప్రాంతీయ సినిమాల్లో నటించడం ఇష్టమే లేదు. కానీ దర్శకుడు ఎస్‌జే సూర్య నన్ను బలవంతపెట్టి 'కొమరం పులి'లో నటింపజేశాడు. అది పరాజయం పాలవడంతో ఆ తర్వాత నాకు అవకాశాలు రాలేదు. అలా చాలా ఏళ్లు ఖాళీగానే ఉన్నాను. ఇప్పుడిప్పుడు కొద్దిగా అవకాశాలు వస్తున్నాయ'ని నికిషా తన మనసులోని మాటను వ్యక్తం చేసింది.