పొట్టిగా, లావుగా ఉందని విమర్శించే వారిపై మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్ స్పందించింది. హీరోయిన్ అంటే సన్నజాజిలా.. ఒంపు సొంపులతో వుండాలని రూల్‌ను బ్రేక్ చేసిన టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్.. పొట్టిగా, బొద్దుగా వున్నానని తాను బాధపడనని చెప్పింది. ఆత్మ విశ్వాసం గల అమ్మాయినని, తానేంటో, తన లైఫ్ ఏంటో తనకు క్లారిటీ వుందని స్పష్టం చేసింది.
తనను విమర్శించే వాళ్లను చూస్తే తనకు నవ్వొస్తుందని.. ఏ పనీ పాటా లేని వాళ్లే ఇలాంటి కామెంట్స్ చేస్తారని ఎద్దేవా చేసింది. పని వున్న వారెవరూ పనిగట్టుకుని ఎదుటివారి జీవితాల్లోకి తొంగిచూడరని కొట్టినట్లు సమాధానం ఇచ్చింది. అంతేకాదు లావు, సన్నబడటం లాంటివి తనకు సంబంధించి చాలా చిన్న విషయాలని పాత్ర డిమాండ్ చేస్తే.. నెల రోజుల్లో సన్నబడతానని నిత్యామీనన్ చెప్పుకొచ్చింది.