తెలంగాణ అసెంబ్లీని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. మిగిలిన రాజకీయ పార్టీలకు ఒక రకంగా షాక్ ఇచ్చారనే చెప్పచ్చు. కెసిఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయడంపై మిశ్రమ స్పందన లభిస్తుంది. అయితే... హీరో మంచు మనోజ్ ట్విట్టర్లో తెలంగాణ ప్రభుత్వం రద్దు అవ్వడంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
ఇంతకీ మనోజ్ ఏమని ట్వీట్ చేసారంటే... కెసిఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. స్వయంపాలన కోసం ఏళ్లపాటు పోరాటం.. త్యాగాలతో ఏర్పాటు చేసుకున్న మొదటి శాసన సభను రద్దు చేయడం కొంచెం బాధగానే ఉంది. కానీ, ఏదైనాసరే మంచి కోసమే.