నిత్యా మీనన్. ఇప్పటివరకు ఈమె హైట్‌కు తగ్గ హీరోలనే వెతుకుతున్నారట దర్శకులు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్ టిఆర్..ఇలా నిత్యామీనన్ కు సరిపోయే హీరోలతోనే ఆమెకు నటించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. చిన్న హీరోలతో చేసి చేసి బోర్ కొట్టేస్తుంది. పెద్ద హీరోలు కావాలి..అది కూడా ఆరడుగులు కన్నా ఎత్తు ఉండాలి. ప్రభాస్, రానా వంటి హీరోలతో చేయాలి. నాకు వారిద్దరితో నటించాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉందని స్నేహితులతో చెబుతోందట నిత్యామీనన్.
ఎప్పుడూ ప్రేమ కథా చిత్రాల్లోనే నాకు ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. ఇది బోరింగ్‌గా అనిపిస్తోంది. కుటుంబ నేపథ్యం ఉండాలి. అంతేకాదు నా క్యారెక్టర్‌కు ఎక్కువ గుర్తింపు రావాలి. అలాంటి క్యారెక్టర్లే చేయాలనుకుంటున్నానంటోంది నిత్యామీనన్. ఆరడుగుల హీరోతో నటించాలంటే ఇబ్బంది కదా అని స్నేహితులు ఆటపట్టిస్తే అవసరమైతే హీల్స్ వేసుకుంటానని చెబుతోందట నిత్య.