హైదరాబాద్ నగరంలోని చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద లభించిన మహిళ మృతదేహం కేసులో కీల పరిణామం చోటుచేసుకుంది. మృతురాలు వెస్ట్ బెంగాల్‌కు చెందిన ప్రమీలగా గుర్తించారు. ప్రియుడే ఆమెను చంపినట్టు పోలీసుల దర్యాప్తు తేలింది. పదేళ్ల నుంచి భర్తతో దూరంగా ఉంటున్న మహిళ.. ఇటీవల పరిచయమైన ఓ యువకుడుతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరూ సహజీవనం చేస్తూ కొండాపూర్‌లో కలిసి ఉంటున్నారు.
వారిమధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా ప్రమీలను చంపేసి, మృతదేహాన్ని వద్ద వదిలేసినట్టు పోలీసులు గుర్తించారు. ప్రమీల మృతదేహాన్ని 37 కిలోమీటర్ల పాటు ఆటోలో తీసుకొచ్చినా పోలీసులు గుర్తించలేకపోవడం గమనార్హం. మృతదేహాన్ని రైల్వే స్టేషన్ ప్రహరీగోడ వద్ద పడేసి వెళ్లిపోయాడు.