అక్కినేని నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో తెరకెక్కిన 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం గురించి చిరంజీవితో సహా పలువురు ప్రముఖులు బ్రహ్మాండంగా వుందని కితాబులిచ్చారు. రాజకీయనాయకులక్కూడా షోలు ప్రదర్శించారు. అద్భుతంగా నాగార్జున నటిస్తే.. దర్శకుడు అంతకంటే అద్భుతంగా తీశారంటూ కొనియాడారు. అయితే ఈ చిత్రంపై బయట డివైడ్ టాక్ వుంది.
అన్నమయ్య, శ్రీరామదాసు కంటే ఏమీ బాగోలేదని కామెంట్లు విన్పిస్తున్నాయి. అందుకు తగినట్లుగా కలెక్షన్లు ఆ రేంజ్‌లో లేకపోవడం బయ్యర్లకు పెద్ద నిరాశను కల్గించిందని తెలుస్తోంది. రిలీజ్ అయి నాలుగు రోజులయినా.. రూ. 7.5 కోట్ల షేర్‌ను మాత్రమే రాబట్టగలిగింది. ఆ తరువాత వసూళ్లు నిలకడగానే వున్నాయి గానీ పెరగలేదు. 40 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా, ఇదే స్థాయిలో కొనసాగితే మాత్రం బయ్యర్లకి నష్టాలు తప్పకపోవచ్చనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. భక్తులు గోవిందుని హుండీలో అయితే వేస్తారు కానీ సినిమా టిక్కెట్లకు ఎందుకిస్తారూ... అని కొంతమంది దీర్ఘం తీస్తున్నారు.