పవన్ కల్యాణ్ మళ్లీ తండ్రి కాబోతున్నారా? అన్నా నిండు గర్భిణీ?

మంగళవారం, 9 మే 2017 (15:42 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకో శుభవార్త అందనుందా? పవన్ మరోసారి తండ్రి కాబోతున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నారు.. సన్నిహితులు. పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజన్వా గర్భం దాల్చిందని, త్వరలో ఓ పండంటి పాపాయికి జన్మనివ్వనుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఆమె ప్రస్తుతం నిండు గర్భిణి అని తెలిసింది. ఇప్పటికే పవన్-అన్నా దంపతులకు పొలెనా అనే పాప కూడా ఉంది. 
 
ఇకపోతే పవన్ రెండో భార్య రేణూ దేశాయ్‌కు కొడుకు అకీరా, కూతురు ఆద్యాలున్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కల్యాణ్ త్రివిక్రమ్‌తో తీస్తున్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. హైదరాబాద్‌లో మొదలైన ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక పవన్ ఫ్యామిలీతో గడపాలనుకుంటున్నారని తెలిసింది.

వెబ్దునియా పై చదవండి