'కందిరీగ' సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్‌ఫుల్ పోలీస్‌గా పవర్ స్టార్...

శుక్రవారం, 13 అక్టోబరు 2017 (16:06 IST)
హీరో పవన్ కల్యాణ్, మాట మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈచిత్రంలో అనుపమ, అనూ ఎమ్మాన్యుయేల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. "అజ్ఞాతవాసి అనే టైటిల్ పేరుతో వచ్చే ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. 
 
ఈ నేపథ్యంలో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలోను పవన్ ఒక సినిమా చేయనున్నాడనే వార్తలు కొంత కాలంగా షికారు చేస్తున్నాయి. 'కందిరీగ' సినిమాతో దర్శకుడిగా సంతోష్ శ్రీనివాస్ తన సత్తాను చాటుకున్నాడు.
 
ఇక ఆయన పవన్‌తో చేయనున్న సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తి కావొచ్చాయని అంటున్నారు. ఈ సినిమాలో పవన్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో కనిపించనున్నాడట. ఈ సినిమా ఫస్టాప్ అంతా కూడా తమిళంలో విజయ్ చేసిన 'తేరి' కథను పోలి వుంటుందట. సెకండాఫ్ చాలా డిఫరెంట్‌గా.. ఆసక్తికరంగా ఉంటుందని ఫిల్మ్ వర్గాల సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు