ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ కేసు : లక్ష్మీ మీనన్‌కు భారీ ఊరట

ఠాగూర్

గురువారం, 28 ఆగస్టు 2025 (11:53 IST)
ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ కేసులో మలయాళ నటి లక్ష్మీ మేనన్‌కు భారీ ఊరట లభించింది. కేరళ హైకోర్టు వచ్చే నెల 17వ తేదీ వరకు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అప్పటివరకు ఆమెను అరెస్టు చేయొద్దని పోలీసులకు సూచించింది. ఈ కిడ్నాప్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. అయితే, ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో అరెస్టు నుంచి తప్పించుకుని, ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడంతో ఆమెకు కోర్టులో ఊరట లభించింది.
 
'గజరాజు', 'ఇంద్రుడు',' చంద్రముఖి-2', 'శబ్దం' వంటి చిత్రాల్లో నటించిన మలయాళ నటి లక్ష్మీ మేనని ఒక ఐటీ విద్యార్థిని కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. కొచ్చిలో ఓ ఐటీ ఉద్యోగిని స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేసి  అతడిపై దాడి చేశారంటూ లక్ష్మీ మేనన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 
 
ఈ కేసులో ఇప్పటికే ముగ్గురుని అరెస్టు చేయగా, నిందితుల్లో ఒకరిగా నటి లక్ష్మీ మీనన్ పరారీలో ఉందని కొచ్చి నగర పోలీస్ కమిషనర్ విమలాదిత్య తెలిపారు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు అయితే, ఆమె పేరును మాత్రం ఇంకా ఎఫ్ఐఆర్‌లో చేర్చలేదనే ప్రచారం సాగుతోంది. 
 
కాగా, పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ఓ బార్ వద్ద లక్ష్మీ మీనన్, ఐటీ ఉద్యోగ బృందాల మధ్య వివాదం తలెత్తింది. అక్కడితో ఆ గొడవ సద్దుమణగకపోవడంతో సదరు ఐటీ ఉద్యోగిని, ఆమె స్నేహితులు కలిసి వెంబడించి, అతడి కారును అడ్డగించి బలవంతంగా తమ కారులో ఎక్కించి, దాడి చేశారు. బాధితుడి  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు