పవన్ ప్రస్తుతం డాలీ డైరెక్షన్లో కాటమరాయుడు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీని తర్వాత త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కుతుందని అనుకున్నారు. పవన్ త్రివిక్రమ్ సినిమా కంటే ముందుగా జిల్లా డైరెక్టర్ నేసన్‌తో కొత్త ప్రాజెక్టు స్టార్ట్ అయింది. ఈ సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు (బుధవారం) జరిగాయి.
ఈ సినిమా పవన్ కెరీర్లో 23వ చిత్రం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్నాడు. ఈ సినిమా డైరెక్టర్ నేసన్ గతంలో తమిళ స్టార్ హీరో విజయ్‌తో జిల్లా అనే సినిమాను తెరకెక్కించాడు. అజిత్ హీరోగా ''వేదాళం'' స్టోరీపై పవన్ బాగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రొడ్యూసర్ ఏఎం రత్నం, పవన్‌తో సంప్రదింపులు చేస్తున్నాడట.
ఈ రీమేక్‌ను తాను నిర్మిస్తానని ఆయన ముందుకొచ్చినట్టు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు పవన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా స్టోరీలో కాస్త మార్పులు చేర్పులు జరుగుతున్నాయని సినీ వర్గాల సమాచారం. మొత్తానికి ఓవైపు డాలీ, మరోవైపు నేసన్, ఇంకోవైపు త్రివిక్రమ్‌లతో పవన్ బిజీ అన్నమాట.